చేతులు, కాళ్లు కట్టేసి.. కుక్కర్‌తో తలపై కొట్టి.. కత్తితో 20 సార్లు పొడిచి.. కూకట్‌పల్లి కేసులో జరిగింది ఇదే..
రేణు, రాకేశ్ అగర్వాల్ మార్వాడీలు. వారికి సనత్ నగర్‌లో స్టీల్ బిజినెస్ ఉంది. వారి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని నిందితులు భావించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు.

Kukatpally Renu Case: హైదరాబాద్, కూకట్‌పల్లికి చెందిన రేణు అగర్వాల్ (50) దారుణ హత్య కేసులో మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. హర్ష, రోషన్ అనే ఇద్దరు యువకులు ఈ హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. రేణు అగర్వాల్ శరీరంపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. రేణు చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి నిందితులు చిత్రహింసలు పెట్టారు.
రేణు అగర్వాల్‌ను హత్య చేసిన హర్ష ఆమె ఇంట్లో పని చేసేవాడు. ఇక ఆమె పక్కింట్లో రోషన్ పనిచేసేవాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రేణు అగర్వాల్ లాకర్ వివరాలు చెప్పకపోవడంతో ఆమెను హర్ష చిత్రహింసలకు గురి చేశాడు. అయితే, ఇంట్లో బంగారం పోలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. రేణు ఆగర్వాల్ ఒంటి మీద ఉన్న బంగారాన్ని మాత్రమే నిందితులు లాక్కెళ్లారు.
Also Read: రేషన్‌కార్డులు అందినప్పటికీ సమస్యలా? ఈ తేదీలోపు ఇలా సరిచేసుకోవచ్చు..
హర్ష, రోషన్ నెల జీతం రూ.15 వేల చొప్పున ఉంది. వారు రేణును చంపడానికి వాడిన కత్తి, ఇంట్లో వదిలేసిన రక్తపు మరకలతో ఉన్న బట్టలను పోలీసులు గుర్తించారు.
రేణును చంపాక ఆమె ఒంటి మీద బంగారంతో పాటు రూ.50 వేల నగదు, 5 తులాల బంగారాన్ని ఆ ఇద్దరు నిందితులు తీసుకెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రేణు కేకలు వేయకుండా ఉండేందుకు ఆమె గొంతులో హర్ష కత్తెరతో పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు.
వారు రెండు కత్తులను హత్యకు వాడారు. రేణు హత్య కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఝార్ఖండ్‌కు కూడా ఓ టీమ్‌ను పంపారు. హర్ష, రోషన్ ఇద్దరు ఝార్ఖండ్‌కు చెందినవారే. వీరిద్దరికి కోల్‌కతాలోని సెక్యూరిటీ ఏజెన్సీ ఏజెంట్ శంకర్ హైదరాబాద్‌లో పని ఇప్పించాడు. రేణు, రాకేశ్ అగర్వాల్ మార్వాడీలు. వారికి సనత్ నగర్‌లో స్టీల్ బిజినెస్ ఉంది. వారి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని నిందితులు భావించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు.