BJP : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ.. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలకు ప్లాన్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) స్పెషల్ ఫోకస్ పెట్టింది.
- Thota Vamshi Kumar
- Published On : January 30, 2024 / 11:45 AM IST
BJP Special Focus on Telangana Lok sabha Elections 2024
Bharatiya Janata Party : తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. 10 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాల అమలుకు సిద్ధమైంది.
ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 19 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలకు ప్లాన్ చేశారు కమలనాథులు. 17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించిన బీజేపీ నేతలు.. ఐదు క్లస్టర్లలో ఏకకాలంలో బస్సు యాత్రలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. బస్సు యాత్రలకు ముఖ్య అతిథులుగా జాతీయ నాయకులు హాజరుకానున్నారు.
Hyderabad : ముషీరాబాద్ గాంధీనగర్‌లో ఇళ్ల కూల్చివేత.. ఉద్రిక్తత
బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ఫిబ్రవరి నెలలో వరుసగా పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లు టూర్ల ద్వారా వీలైనన్నీ ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో కాషాయజెండాను ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అయోధ్య అంశంతో దేశ వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నది ఆ పార్టీ అభిప్రాయం.
ఆ ఫీల్‌గుడ్ ప్యాక్టర్ కొనసాగేలా కార్యక్రమాల రూపకల్పన చేయడం ద్వారా ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది.
