Bhoghi Celebrations: భోగి సంబరాల్లో పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు.. వీడియోలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభయ్యాయి. సోమవారం భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు.

Bhoghi Celebrations

Bhoghi Celebrations: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభయ్యాయి. సోమవారం భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. తెల్లవారు జామున భోగి మంటలు వేశారు. పిల్లలు, పెద్దలు, మహిళలు భోగి మంటల చుట్టూ పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. మరోవైపు ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమ ఇళ్ల ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. హరిదాసులతో పాటు.. అలంకరించిన బసవన్నలు, గాలి పటాలను ఎగురవేస్తూ యువకులు.. ఇలా పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతుంది.

 

సోమవారం ఉదయం భోగి వేడుకల్లో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భోగి మంటలు అంటించి భోగి వేడుకలను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, నందమూరి వసుందర తదితరులు పరిశీలించారు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు.