హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పార్లమెంట్ సభ్యుడు మల్లు రవికి చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయానికి హీరో నాగార్జున, మల్లు రవి ఒకేసారి రావడంతో నాగార్జునకు సెక్యూరిటీ ఇస్తూ, అదే సమయంలో మల్లు రవిని పక్కనుంచి వెళ్లాలని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు సూచించారు.
దీంతో ఆ సెక్యూరిటీ అధికారులపై మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటలకు పైగా మల్లు రవి విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు విమానాశ్రయ అధికారులు సిద్ధమవుతున్నారు.
కాగా, మల్లు రవి 2024 లోక్ సభ ఎన్నికల్లో 94,414 మెజార్టీతో పోతుగంటి భరత్ పై గెలిచారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వచ్చిన ప్రజా తీర్పును వైసీపీ వక్రీకరిస్తోంది: రామ్మోహన్ నాయుడు