BJP Chief Bandi Sanjay : రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది-బీజేపీ చీఫ్ బండి సంజయ్

రైతుల వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

BJP Chief Bandi Sanjay :  రైతుల వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను, మంత్రులను ఉసిగొల్పి పోలీసుల సహాయంతో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారన్నారు.  రైతులను కాపాడే యత్నంలో 56 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయని…. 20 వాహనాలు ధ్వంసమయ్యాయని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేయడం లేదని….. సబ్సిడీలన్నీ ఎత్తేసారని బండి సంజయ్ చెప్పారు. ఏడేళ్లుగా ఒక్కసారి కూడా బోనస్ ఇవ్వకుండా రైతులను సీఎం కేసీఆర్ మోసం చేసారని అన్నారు.  రాష్ట్రంలో మూడెకరాల భూమి పధకం కూడా అమలవటంలేదని…. సీఎం దళితులను మోసం చేసారని బండి సంజయ్ అన్నారు. దళిత బంధు పేరుతో దళితుల ఓట్లు దండుకోవాలని చూశారని….ప్రశ్నించే గొంతును పార్టీ నుంచి గెంటేస్తున్నారని…ఇందుకు ఉదాహరణ ఈటల రాజేందర్ అని బీజేపీ  అధ్యక్షుడు సంజయ్ వివరించారు.

కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేకుండా…ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం పీకేసిందన్నారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టుల రోస్టర్‌ను జీరో నుంచి 13 వేల ఉద్యోగాలు మాయం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆయన అన్నారు.  వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు, రోడ్డున పడ్డారని బండి సంజయ్ పేర్కోన్నారు. ఉద్యమాల ఫలితంగా రాజకీయంగా పెనుమార్పులు సంభించాయని…రాష్ట్రంలో కుటుంబ, నియంత, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read : Woman Commits Suicide : గుంటూరు జిల్లాలో మహిళ ఆత్మహత్య
ఇందిరా గాంధీ మొదలు మన్మోహన్ సింగ్ పాలన వరకు చూశాం. ప్రజలు కుటుంబ పాలనకు చరమగీతం పాడారని బండి తెలిపారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మొదలు చంద్రబాబు  హయాం వరకు కుటుంబ, నియంత, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రంలో  కూడా ప్రస్తుతం నియంత, కుటుం పాలన కొనసాగుతోందని… ప్రజల ద్రుష్టి మళ్లించడానికి సీఎం కేసీఆర్ కుట్రలు  చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు