BJP Muralidhara Rao : సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

అవినీతి చేస్తే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు.

Muralidhar

Muralidhara Rao comments on CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అంశంలో సీఎం కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయమన్నారు. బుధవారం (జనవరి12,2022) హైదరాబాద్ లో మురళీధరరావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అవినీతి చేస్తే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పోటీలోనే లేదని చెప్పారు.

CM KCR : ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుని నియమించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పంచాయితీలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారని విమర్శించారు.