గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం

  • Publish Date - November 19, 2020 / 05:56 PM IST

bjp leader suicide attempt: గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వారు మనస్తాపానికి గురవుతున్నారు. ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. కార్పొరేటర్ టికెట్ తనకు ఇవ్వలేదని బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు టికెట్ ఇవ్వలేదని నాచారం బీజేపీ నాయకురాలు విజయలలితా రెడ్డి నిద్రమాత్రలు మింగింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

గ్రేటర్ లో రాజకీయాలు వేడెక్కాయి. బల్దియా ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో, కన్ఫర్మ్ అయినవాళ్లు నామినేషన్లు వేయడంలో బిజీ అయిపోయారు. బుధవారం(నవంబర్ 18,2020) నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం( నవంబర్ 20) నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఈ రోజు(నవంబర్ 19,2020) భారీగా నామినేషన్లు పడ్డాయి.

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు గాను నామినేషన్లు ప్రారంభమైన తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలైన 20 నామినేషన్లలో టీఆర్‌ఎస్‌ 06, బీజేపీ 02, కాంగ్రెస్‌ 03, టీడీపీ 05, గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక నామినేషన్‌ వచ్చింది. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. 150 వార్డులకు గాను డిసెంబర్‌ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు అఖరు తేదీ నవంబర్‌ 20 కాగా, 21న నామినేషన్లు పరిశీలించి, 22న ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు.

ట్రెండింగ్ వార్తలు