Eatala Rajender : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది.

eatala rajender

Eatala Rajender  : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య(104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు.గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య హైదరాబాద్ లో ఒక ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఈటల రాజేందర్ రెండో కుమారుడు.