Rajasingh
Raja singh fire on KCR: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పై బీజేపీ నేతల మాటల యుద్ధం కొనసాగుతుంది. బీజేపీ నేతలు వరుసగా టీఆర్ఎస్ పైనా, కేసీఆర్ పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ అవినీతి పాలనకు బీజేపీ చరమగీతం పాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ప్రకటించగా..ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు మతి తప్పినట్టుందని ఘాటు విమర్శలు చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభిస్తున్నారని, ఇది నిజంగా గవర్నర్ ను అవమానించడమే అంటూ రాజాసింగ్ మండిపడ్డారు. కేసీఆర్ మతి భ్రమించిందని..ఆసుపత్రికి వెళ్లమంటూ గతంలో చాలా సార్లు సూచించానని రాజాసింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా చేసిన పనుల గురించి.. అసెంబ్లీ సమావేశాల సమయంలో గవర్నర్ తన ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేస్తారని.. కానీ సంవత్సరం నుండి రాష్ట్రానికి కేసీఆర్ ఏమి చేయనందునే గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఒక మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా కేసీఆర్.. గవర్నర్ ను, రాజ్యాంగ పదవిని అవమానిస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. ప్రధాని మోదీని చూస్తే కేసీఆర్ కు భయమేస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Also read: Bandi Sanjay: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు అడ్డుకట్టవేస్తాం: బీజేపీ బండి సంజయ్