Bandi Sanjay: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు అడ్డుకట్టవేస్తాం: బీజేపీ బండి సంజయ్

బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు

Bandi Sanjay: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు అడ్డుకట్టవేస్తాం: బీజేపీ బండి సంజయ్

Bandi

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన జోనల్ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. ఈసంధర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేలా మార్చి 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులుతో హైదరాబాద్ నుండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయ్యిందని..అంబేద్కర్ జయంతిని పురస్కరించకుని ఏప్రిల్ 14 నుండి రెండో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపట్టనున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

Also read: Mohanbabu Manchu : మోహన్ బాబు ఫ్యామిలీపై హెయిర్ డ్రెస్సర్ ఆరోపణలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై బండి సంజయ్ స్పందిస్తూ.. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పుడు అఫిడవిట్ పై..ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్ చేయడం అత్యంత దారుణమని అన్నారు. సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతో ఫిర్యాదు దారులను పోలీసులే కిడ్నాప్ చేశారని సంజయ్ ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి, భూ కబ్జాలను సహించలేక బాధితులు ఫిర్యాదు చేస్తే..పోలీసులు నేతలకు వత్తాసు పలుకుతూ బాధితులనే కిడ్నప్ చేయడం అన్యాయమని బండి సంజయ్ అన్నారు. మంత్రి తప్పుడు అఫిడవిట్ పై ఎన్నికల కమిషన్ విచారణ ముగిసే వరకు ఆరుగురు ఫిర్యాదు దారులను జైళ్లో పెట్టడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారని, బీజేపీ ఆందోళనతో ఫిర్యాదు దారులను పోలీసులు బయటకు తీసుకొచ్చినప్పటికీ వారిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 7నుంచి!

చట్టబద్దంగా కొట్లాడే ధైర్యం లేని సీఎం అడ్డగోలుగా గెలిచి అవినీతికి పాల్పడుతున్న మంత్రికి వత్తాసు పలుకుతూ కిడ్నాప్ లు చేయించడం సిగ్గుచేటని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దారుణాలను బీజేపీ అడ్డుకుని తీరుతుందన్న బండి సంజయ్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేసే వరకు పార్టీ పరంగా ఆందోళనలను కొనసాగిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ మంత్రులతో పాటు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై.. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తామని సంజయ్ అన్నారు. గత ఎన్నికలకు ముందు ఆయా నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో చూపిన ఆస్తులను, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక సంపాదించిన ఆస్తులను బేరీజు వేసి వాటి ఆధారంగా విచారణ జరిగేదాకా ప్రజా క్షేత్రంలో పోరాడతామని సంజయ్ హెచ్చరించారు.

Also read: Nara Lokesh: ఈ మూడేళ్లలో వైసీపీ విశాఖలో చేసిన అభివృద్ధి ఏమిటి?: నారా లోకేష్

జనగామ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారని.. అదే జనగామలోనే మార్చి నెలాఖరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ సత్తా చూపిస్తామని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాల వల్లే బెంగాల్ లో బీజేపీ ఓట్ల శాతం 40 శాతం దాటిందని.. గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలోనూ బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోందని.. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని సంజయ్ చెప్పారు. హైదరాబాద్ సిటీలో బీజేపీ ఓటు బ్యాంక్ 60 శాతానికి పెరిగిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియడంతో సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారన్న బండి సంజయ్.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నరని అన్నారు. ఎప్పుడు ఎన్నికలెప్పుడొచ్చినా…బీజేపీ సిద్ధంగా ఉందని.. ఈసారి అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Also read: KCR: దేశ రాజకీయాల్లోకి కేసీఆర్.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్..!

తెలంగాణతో పాటు కేంద్రంలోనూ కుటుంబ పాలన చేస్తున్న పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకపక్షంగా నిలవాలని, ప్రజా స్వామిక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని బండి సంజయ్ తెలిపారు. నిజమైన ఉద్యమ కారులతోపాటు ప్రజాస్వామిక తెలంగాణ కోరుకునే మేధావులంతా బీజేపీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించి ప్రజా స్వామిక తెలంగాణను ఏర్పాటు దిశగా కృషి చేద్దామని బండి సంజయ్ పిలుపునిచ్చారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట పెరుగుతోంది, భారత జాతి పతకాన్ని చూసి రష్యా, ఉక్రెయిన్ దేశాలు సైతం లేచి సెల్యూట్ చేసే పరిస్థితి నెలకొంది, మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే ఇందుకు కారణం” అని బండి సంజయ్ తెలిపారు.