AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 7నుంచి!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. మార్చి 7నుంచి!

Ap Assembly

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.

మార్చి 7వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనుండగా.. మార్చి 8వ తేదీన గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సభ సంతాపం తెలపబోతుంది. మార్చి 11వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముంది.

ఈ బడ్జట్ సమావేశాల్లోనే మూడు రాజధానులు, ఏఎంఆర్డిఏ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మార్చి 11న రూ.2.30లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే బడ్జెట్ అంశంపై అన్ని శాఖల కసరత్తు పూర్తయినట్లు సమాచారం. ఈసారి బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  వ్యవసాయం పాడి పరిశ్రమపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సభ్యులు చెబుతున్నారు.

గత సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. సమగ్రమైన అంశాలతో మళ్లీ ఈ సమావేశాల్లోనే కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నటుల చెబుతున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రానుంది.