Nara Lokesh: ఈ మూడేళ్లలో వైసీపీ విశాఖలో చేసిన అభివృద్ధి ఏమిటి?: నారా లోకేష్

వేకా హత్య నిందితులను కనిపెట్టడంలో జగన్ ఎందుకు ఉత్సాహం కనబరచడంలేదని ప్రశ్నించిన లోకేష్..హత్యకు వాళ్ళే సూత్రధారులంటూ సంచలన ఆరోపణలు చేశారు

Nara Lokesh: ఈ మూడేళ్లలో వైసీపీ విశాఖలో చేసిన అభివృద్ధి ఏమిటి?: నారా లోకేష్

Jagan

Nara Lokesh: జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విశాఖ అంటూ ప్రజలను మభ్యపెట్టారని.. ఈ మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం విశాఖలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. సోమవారం లోకేష్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఫ్యాక్షన్ మూలాలు ఉన్న జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో వ్యాపారాన్ని తానే చేయ్యాలని భవిస్తూ, మిగతా వ్యాపారులను వేధిస్తు భయపెడుతున్నారని లోకేష్ ఆరోపించారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పై పడ్డ జగన్ ఇండియాలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా షరతులు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ లేకుండా చేయ్యాలని చుస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు.

Also read: KCR: దేశ రాజకీయాల్లోకి కేసీఆర్.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్..!

జగన్ సొంత బాబాయ్ వివేకా హత్య పై జగన్ ఎందుకు స్పందించడం లేదని లోకేష్ ప్రశ్నించారు. వివేకా హత్య నిందితులను కనిపెట్టడంలో జగన్ ఎందుకు ఉత్సాహం కనబరచడంలేదని ప్రశ్నించిన లోకేష్..హత్యకు వాళ్ళే సూత్రధారులంటూ సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారో ఆయన కుమార్తె సునీతా రెడ్డి స్పష్టంగా చెప్పారని అయినా జగన్ స్పందించడం లేదని అన్నారు. వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పిన అవినాష్ రెడ్డే..హత్య చేయించారన్న విషయం అందరికి తెలిసిపోయిందని.. అటువంటి అవినాష్ రెడ్డి జైలుకెళ్ళకుండా ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నాడని లోకేష్ అన్నారు. జగన్ అవినాష్ ని వెనకేసుకొస్తున్నారని లోకేష్ ఆరోపించారు. వివేకా హత్య కేసులో సీబీఐ పై రాష్ట్ర పోలీసులు కేసులు పెడుతున్నారని.. సీబీఐపైనే కేసులు పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నానని లోకేష్ అన్నారు.

Also read: TDP : యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత.. బాబు, టీడీపీ నేతల సంతాపం

ఏపీ కొత్త రాజదాని విశాఖ అని హడావిడి చేసిన వైసీపీ నేతలు విశాఖలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని లోకేష్ పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖ నుంచి హెచ్.ఎస్.బీ.సీ సంస్థ వెళ్లిపోయిందని, రూ.లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని వచ్చిన అదానీ డేటా సెంటర్ ముంబైకి వెళ్లిపోయిందని.. జగన్ పాలనలో రాష్ట్రానికి ఓక్క పరిశ్రమ రాలేదని లోకేష్ విమర్శించారు. వైసీపీ నేతలు ఇక్కడ డబ్బులు దోచుకోని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. జగన్మోహనరెడ్డికి ఓటీపీకి ఓటీటీకి తేడా తెలియదని లోకేష్ ఎద్దేవా చేశారు. 5.4 లక్షల ఉద్యోగాలు కల్పన చంద్రబాబు హయాంలో వచ్చాయని అని గౌతంరెడ్డి చెప్పారని.. వైసీపీ హయాంలో వచ్చిన ఉద్యోగాలు ఎన్నని లోకేష్ ప్రశ్నించారు. “రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది..ఇలాగే పోతే ప్రజలపై పన్నులు భారం పెరుగుతుంది, ఇప్పటికే అన్ని తాకట్టు పెట్టారు..ఇంకా రోడ్లు మిగిలాయి వాటిని తాకట్టు పెడతారు..బ్యాంక్ లు టోల్స్ ఎర్పాటు చేస్తాయి” అంటూ వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ విరుచుకుపడ్డారు.

Also read: Kapila Theertham : కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు చేసే అర్హత జగన్మోహనరెడ్డికి లేదన్న లోకేష్.. కేంద్రం బౌండరీలు మార్చవద్దు అని చెప్పినా.. హడవుడిగా జిల్లాల విభజన చేసారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రశ్నిస్తే తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారని తప్పుడు వార్తలు ఎవ్వరు రాసినా ఊరుకోనేది లేదని లోకేష్ హెచ్చరించారు. భీమ్లా నాయక్ సినిమా నాకు నచ్చింది అందుకే ట్విట్ చేశానన్న లోకేష్..ఎవరి పై ట్వీట్ పెట్టాలో వాళ్ళు(వైసీపీ నేతలు) చెప్పాలా అంటూ విమర్శించారు. ఇక కాపు మీటింగ్ పై లోకేష్ స్పందిస్తూ.. కాపు మీటింగ్ వారి సామాజిక వ్యక్తిగతమైన విషయమని, కాపులకు బహుజనులకు టీడీపీ వెన్నంటే ఉంటుందని అన్నారు.