Home Minister Amit Shah : బీజేపీ ఎంఐఎంకు భయపడదు- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

బీజేపీ తెలంగాణలో  అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.

Home Minister Amit Shah :  బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. శుక్రవారం నిర్మల్ లో భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ అధ్వర్యంలోనిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…సర్దార్ వల్లబ్బాయి పటేల్‌ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ విమోచనం సాధ్యమైందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని…మహరాష్ట్ర మరఠ్వాడ కర్ణాటకలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నాయని అమిత్ షా అన్నారు.

ఎంఐఎం పార్టీపై అమిత్ షా తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని… బీజేపీ ఎంఐఎం కు భయపడదని ఆయన అన్నారు. దాన్ని ఎదుర్కోనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని అన్నారు.టిఆర్ఎస్ కు ఎంఐఎం మో చేతి కర్రగా పనిచేస్తోందని…టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై, ఎంఐఎం పై పోరాటానికే ఎంపీ బండి సంజయ్ సంగ్రామ యాత్ర చేపట్టారని ఆయన పేర్కోన్నారు. మజ్లీస్‌తో, టీఆర్ఎస్‌తో పోరాటం చేసే పార్టీ బిజెపి‌నే అని..టీఆర్ఎస్‌కు..కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని అమిత్ షా చెప్పారు.
Also Read : Telangana High Court : రాజు ఆత్మహత్యపై జ్యూడిషియల్ విచారణ-టీఎస్ హైకోర్టు ఆదేశం

బీజేపీ తప్ప తెలంగాణ లో ఏ పార్టీ ఎంఐఎం కు వ్యతిరేకంగా పోరాటం చేయదని… తెలంగాణ పోరాట యోధుల త్యాగాలు ఊరికే పోవని… తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టేలా బీజేపీ పని చేస్తుందని…ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మజ్లీస్ ను ఎదుర్కునే పార్టీ నే తెలంగాణ లో అధికారంలోకి రావాలని, కుటుంబ పాలన నుండి తెలంగాణ ను విముక్తి చేసేందుకు, 2024లో పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 17 పార్లమెంట్ స్థానాలు మోడీకి బహుమతి గా ఇవ్వాలని కోరారు.

తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్‌ హామీ ఏమైందని తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టడంలేదని, తెలంగాణ లో నాలుగు ఎంపి సీట్లు గెలువగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో లోక్‌సభ సీట్లన్నీ గెలుస్తామని అమిత్ షా అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అంతిమ దశకు చేరుకుందని, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని…. బీజేపీ మాత్రమే మజ్లిస్‌తో పోరాడుతుందని ఆయన అన్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించాలని చప్పట్లతో మద్దతు ఇవ్వాలని కోరగా సభలో నినాదాలతో ప్రజలు మద్దతు తెలియ జేశారు.
Also Read : Extra Marital Affair : అక్రమ సంబంధం తెలిసి పోయిందని కొడుకు హత్య

హుజురాబాద్ లో ఈటెల్ రాజేందర్ ను గెలిపించి కుటుంబ పాలనను తరిమికొట్టాలని అమిత్ షా కోరారు. అమరుల చరిత్రను తెలియచేసేందుకే నిర్మల్ తెలంగాణ విమోచనదినోత్సవ సభ పెట్టామని అమిత్ షా చెప్పారు. విమోచన దినోత్సవం జరపని కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమానించినట్టే నని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలుక క్షమాపణ చెప్పాల్సిందే అని ….కేసీఆర్ పై పోరాటంతో ప్రజలంతా బీజేపీ తో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

1400 మంది అమరుల త్యాగాలనుబీజేపీ మర్చిపోదు అని… తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వారి కుటుంబాలను ఆదుకుని వారందరీ పింఛన్లు ఇస్తాం అని అమిత్ షా హామీ ఇచ్చారు. సర్దార్ పటేల్ లేకపోతే కేసీఆర్ సీఎం అయ్యేవారుకాదని ఆయన అన్నారు. సర్ధార్ పటేల్ చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తామని అమిత్ షా చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు