BJP Support : విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు బీజేపీ మద్దతు

తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మధు కుమార్, రవీందర్ రెడ్డి తదితరులు కరీంనగర్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను కలిశారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

Bandi Sanjay (2)

BJP Support : విద్యుత్ సంస్థల్లో  పనిచేసే ఆర్టిజన్లు సమ్మెకు దిగనున్నారు. వేతన సవరణ సరిపోలేదన్న సాకుతో ఏప్రిల్ 25 నుండి సమ్మెకు పిలుపు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మధు కుమార్, రవీందర్ రెడ్డి తదితరులు కరీంనగర్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను కలిశారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సమ్మె చేస్తానంటే అరెస్టులతో భయపెడతారా? అని ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తారా? అని నిలదీశారు. ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి విద్యుత్ సంస్థ సర్వీస్ రూల్స్ ను వర్తింపజేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆర్టిజన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Prabhakar Rao : విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధం.. పాల్గొంటే కఠిన చర్యలు : డి.ప్రభాకర్ రావు

ఆర్టిజన్లపై ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుండి తొలగిస్తామనడం దుర్మార్గమని తెలిపారు. రేపటి సమ్మెను భగ్నం చేసేందుకు ఆర్టిజన్లను ముందస్తుగా అరెస్టులు చేస్తూ బెదిరింపులకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడంతోపాటు ఆర్టిజన్లకు విద్యుత్ సర్వీస్ రూల్స్ ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ బండి సంజయ్ హామీ ఇచ్చారు.

మరోవైపు విద్యుత్ సంస్థలలో సమ్మె నిషేధం అమలులో ఉందని టీఎస్ జెన్ కో & టీ ఎస్ ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావు అన్నారు. ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొంటే సర్వీసు నిబంధన 34 (20) ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని తెలిపారు. విద్యుత్ కార్మిక సంఘాలతో ఏప్రిల్ 15వ తేదీన వేతన సవరణ ఒప్పందం ముగిసిందని తెలిపారు.