Lok Sabha election-2024: తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. మల్కాజిగిరి నుంచి ఈటల

పోతుగంటి భరత్ (నాగర్ కర్నూల్), జహీరాబాద్ (బీబీ పాటిల్), మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పేర్లు ఉన్నాయి.

కొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ న్యూఢిల్లీ నుంచి తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజిగిరి నుంచి చాలా మంది పోటీ పడ్డారు. చివరకు ఈటల రాజేందర్ కు టికెట్ దక్కింది. బీబీ పాటిల్‌కు బీజేపీలో చేరిన తదుపరి రోజే టికెట్ దక్కింది.

బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదాన్ని తీసుకెళుతోంది. తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థి పేరు ప్రకటించలేదు. సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నేత సోయం బాపూరావు ఉన్నారు. ఎల్లుండి ఆదిలాబాద్ కు నరేంద్ర మోదీ వస్తున్నారు. అయినప్పటికీ ఆ ఎంపీ సీటుపై అధిష్ఠానం ఎటూ తేల్చలేదు.

రకరకాల ఊహాగానాల మధ్య మల్కాజ్‌గిరి సీటును దక్కించుకున్నారు ఈటల రాజేందర్. మల్కాజ్‌గిరి టికెట్ ఆశించి సీనియర్ నేత మురళీధరరావు, మల్క కొమరయ్య, పన్నల హరీశ్ రెడ్డి నిరాశకు గురయ్యారు. మహబూబ్‌నగర్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది బీజేపీ. మహబూబ్‌నగర్ సీటు కోసం డీకే.అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య తీవ్ర పోటీ ఉంది. నాగర్‌కర్నూల్ సీటును తన కుమారుడు భరత్ కు ఇప్పించుకున్నారు ఎంపీ రాములు.

9 స్థానాల్లో అభ్యర్థులు వీరే..

  • కిషన్ రెడ్డి (సికింద్రాబాద్)
  • బండి సంజయ్ (కరీంనగర్)
  • అరవింద్ (నిజామాబాద్)
  • బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి)
  • మాధవి లత (హైదరాబాద్)
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల)
  • పోతుగంటి భరత్ (నాగర్ కర్నూల్)
  • బీబీ పాటిల్ (జహీరాబాద్)
  • ఈటల రాజేందర్ (మల్కాజిగిరి)

 

  • టికెట్లు ప్రకటించని స్థానాలు
  • ఆదిలాబాద్
  • మహబూబాబాద్
  • మహబూబ్ నగర్
  • మెదక్
  • నాగర్ కర్నూల్
  • నల్లగొండ
  • పెద్దపల్లి
  • వరంగల్

ట్రెండింగ్ వార్తలు