×
Ad

Municipal Elections: ఓటింగ్ అంతా బీజేపీవైపే..! మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వ్యూహం ఇదే..!

నరేంద్ర మోడీ నాయకత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు నిధులిచ్చింది, తాగడానికి మంచి నీళ్లు ఇచ్చింది. ప్రతి అంశంలో బీజేపీకి పాజిటివిటీ కనపడుతోంది.

Raghunandan Rao Representative Image (Image Credit To Original Source)

  • నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చినవే
  • విజయ లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్తున్నాం
  • మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ముందు ఉంటుంది

 

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. శంషాబాద్ నోవాటెల్ లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ లు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

మున్సిపల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. లిటరసీ ఎక్కువున్న ఏరియా కాబట్టి బీజేపీకి సహజంగానే పట్టు ఉంటుందన్నారు. ఇప్పటికే పాత 10 జిల్లాల కేంద్రాలలో ఏదో సందర్భంలో ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ఎడ్యుకేటడ్ ఓటింగ్ అంతా బీజేపీవైపే ఓటింగ్ ఉంటుందన్న ఆలోచన ఉంటుంది కాబట్టి అలా కనపడుతుందన్నారు. మున్సిపాలిటీలకు వచ్చిన నిధులు, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, అమృత నిధులు అన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే అన్నారు. మంచి నీళ్లు కావాలంటే స్వామి ది నిధి నుండి ఇచ్చామన్నారు. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

”నరేంద్ర మోడీ నాయకత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు నిధులిచ్చింది, తాగడానికి మంచి నీళ్లు ఇచ్చింది. ప్రతి అంశంలో బీజేపీకి పాజిటివిటీ కనపడుతోంది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ముందు ఉంటుందన్న ఆశ ఉంది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏం చేసిందో కాంగ్రెస్ కూడా మళ్లీ అదే రిపీట్ చేస్తుంది. కావాలనే బీజేపీ మీద బురద జల్లుతున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు ఏ విధమైనటువంటి నిధులు ఇస్తున్నారో ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాలకు అలాగే నిధులు ఇస్తోంది కేంద్రం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఎన్ని నిధులివ్వాలో అన్ని ఇస్తున్నాం. రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకునే పుస్తకం అనుకునే వారికి ఇంతకన్నా మేము ఏమీ చెప్పలేము” అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

”విజయలక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్తున్నాం. ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం అధికారంలోకి రావడమే. అదే లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. మున్సిపాలిటీలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక వెనక్కి పోతున్నాయి. అబద్ధాలు ప్రచారం చేయడం తప్ప బీఆర్ఎస్ కు మరొకటి లేదు. మా ప్రధాన ఏజెండా నరేంద్ర మోడీ. ఆయన చేసిన కార్యక్రమాలను పబ్లిక్ లోకి తీసుకెళ్తాం ఓటు అడుగుతాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు. పూర్తిగా తుడిచి పెట్టుకునిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నన్ను తిరగమ్మన్నారు. తిరుగుతాను” అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

Also Read: మోగిన నగారా.. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రేపటి నుంచే