Amit Shah Telangana : ఇక ప్రతి నెల తెలంగాణకు అమిత్ షా.. టార్గెట్ 2023

తెలంగాణలో 2023లో అధికారమే ధ్యేయంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం మరిన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇకపై అమిత్ షా ప్రతి నెల తెలంగాణకు రానున్నారు. ఎన్నికల వరకు ప్రతి నెలలో రెండు రోజుల పాటు తెలంగాణలో మకాం వేయనున్నారు.

Amit Shah Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంది. ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో సమాచార హక్కు చట్టాన్ని తన అస్త్రంగా చేసుకుంది బీజేపీ. ఆర్టీఐ యాక్ట్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కమలదళం చూస్తోంది.

BJP Target TRS : బీజేపీ దూకుడు.. ఏకంగా 25వేల దరఖాస్తులు.. మరోసారి RTI ప్రయోగం

తెలంగాణలో 2023లో అధికారమే ధ్యేయంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం మరిన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్లు సమాచారం. అమిత్ షా కనుసన్నల్లోనే తెలంగాణ రాజకీయాలు సాగనున్నాయి. ఇకపై అమిత్ షా ప్రతి నెల తెలంగాణకు రానున్నారు. ఎన్నికల వరకు ప్రతి నెలలో రెండు రోజుల పాటు తెలంగాణలో మకాం వేయనున్నారు అమిత్ షా.

Komatireddy Rajgopal Reddy : బీజేపీ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

తెలంగాణ ప్రజల్లోని సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్లాన్ చేస్తోంది బీజేపీ. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణపై ఇప్పటికీ పొలిటికల్ రగడ కొనసాగుతూనే ఉంది. అధికారికంగా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే తాజాగా మరో ముందడుగు వేసింది. సెప్టెంబర్ 17న తెలంగాణ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించేలా నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఆహ్వానిస్తామని అంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించారు.

Bandi Sanjay : కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదు-బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఒకవైపు బండి సంజయ్ పాదయాత్ర, మరోవైపు నియోజకవర్గాల్లో బైక్ రాల్యీలతో ప్రణాళిక తయారు చేశారు. పార్లమెంట్ ప్రవాసయోజనతో గ్రామగ్రామానికి వెళ్లనున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జ్ లుగా కేంద్ర మంత్రులను నియమించారు. ఇక పార్టీలో చేరికలపైనా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈటల రాజేందర్ కమిటీ.. ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ చేసింది. వచ్చే నెలలో పలువురి చేరికలు ఉంటాయని చెబుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు