BJP Target TRS : బీజేపీ దూకుడు.. ఏకంగా 25వేల దరఖాస్తులు.. మరోసారి RTI ప్రయోగం

తెలంగాణ సర్కార్ పై మరోసారి సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని ఎక్కుపెట్టింది బీజేపీ. ఈసారి పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ పై ఆర్టీఐ అస్ట్రాన్ని సంధించేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు.

BJP Target TRS : బీజేపీ దూకుడు.. ఏకంగా 25వేల దరఖాస్తులు.. మరోసారి RTI ప్రయోగం

Bandi Sanjay

BJP Target TRS : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంది. ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో సమాచార హక్కు చట్టాన్ని తన అస్త్రంగా చేసుకుంది బీజేపీ. ఆర్టీఐ యాక్ట్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కమలదళం చూస్తోంది.

Bandi Sanjay : కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదు-బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సర్కార్ పై మరోసారి సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని ఎక్కుపెట్టింది బీజేపీ. ఈసారి పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ పై ఆర్టీఐ అస్ట్రాన్ని సంధించేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు. కేంద్రం నుంచి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులపై ఆర్టీఐ కింద దరఖాస్తు చేసేందుకు రెడీ అవుతోంది.

Komatireddy Rajgopal Reddy : బీజేపీ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

రాష్ట్రంలోని దాదాపు 12వేల పంచాయతీలతో పాటు ఎంపీడీవో ఆఫీసుల్లో 25వేల దరఖాస్తులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు కమలనాథులు. అభివృద్ధి కార్యక్రమాలపై బీజేపీ నాయకులు సమాచారం కోరనున్నారు.

Bandi Sanjay: టీఆర్ఎస్ స‌ర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ ద‌ర‌ఖాస్తులు

గ్రామ పంచాయతీల్లో ఏం జరుగుతోంది? మండల ఆఫీసుల్లో ఏం జరుగుతోంది? కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది? ఇలాంటి అనేక సమాచారం కోరుతూ 25వేల దరఖాస్తులను 12వేల 700కు పైగా ఉన్న గ్రామ పంచాయితీలు, 540 మండల ఆఫీసులకు పంపించనున్నారు. పంచాయతీ రాజ్ సెక్రటరీకి దరఖాస్తు చేయనున్నారు.

9 ప్రశ్నలతో దరఖాస్తు తయారు చేశారు. 13, 14, 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా 2014 నుండి ఇప్పటివరకు ఎన్ని నిధులు గ్రామ పంచాయతీకి వచ్చాయి? ఎన్ని నిధులను ఖర్చు చేశారు? వాటి ద్వారా జరిగిన అభివృద్ధి పనులు ఏంటి? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని దరఖాస్తు చేయనున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పంచాయతీ రాజ్ లో పన్నుల రూపంలో వచ్చిన నిధులు ఎన్ని? మార్కెట్ సెస్ ల ద్వారా వచ్చిన నిధులు ఎన్ని? వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని అడగనున్నారు. వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేశారు? ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? వీటన్నింటికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.