Komatireddy Rajgopal Reddy : బీజేపీ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నారా? ఇందుకు బీజేపీ అధిష్ఠానం రంగం సిద్ధం చేసిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్‌షాతో రహస్యంగా సమావేశమైనట్టు బీజేపీలోని ఉన్నత వర్గాల సమాచారం.

Komatireddy Rajgopal Reddy : బీజేపీ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

Rajagopal Reddy

Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నారా? ఇందుకు బీజేపీ అధిష్ఠానం రంగం సిద్ధం చేసిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత అమిత్‌షాతో రహస్యంగా సమావేశమైనట్టు బీజేపీలోని ఉన్నత వర్గాల సమాచారం. వారిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ సమావేశానికి జార్ఖండ్‌లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్‌ దూబే (బీజేపీ) మధ్యవర్తిత్వం వహించారని సమాచారం.

ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేరాల్సిందిగా అమిత్‌షా ఆహ్వానించినట్టు తెలిసింది. దీనికి రాజగోపాల్‌రెడ్డి సైతం దాదాపు ఓకే చెప్పినట్టు సమాచారం. వ్యాపారవేత్తలైన రాజగోపాల్‌రెడ్డి, నిషికాంత్‌ దూబే మధ్య కొన్నేండ్లుగా సాన్నిహిత్యం ఉన్నదని, రాజగోపాల్‌రెడ్డి జార్ఖండ్‌లో కాంట్రాక్ట్‌లు చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ స్నేహంతోనే ఈ భేటీకి దూబే మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తోంది.

Telangana Cong : టీడీపీ వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..ఇంతే మరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పలుమార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారు. తాజాగా బుధవారం మరోసారి అమిత్ షా ను కలిశారు. తనకు సన్నిహితుడైన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేతో కలిసి అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలిసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. రాజీనామా చేసి పార్టీలోకి రావాలని రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా సూచించినట్లు సమాచారం. తెలంగాణాలో మరో ఉప ఎన్నికను బీజేపీ నేతలు కోరుకుంటున్నారు.

వరుస ఉప ఎన్నికలు తేవడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునకలయ్యేలా ఎంగేజ్‌ చేయాలని బీజేపీ ఎత్తుగడ అని ఆ పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిలువరించడంతోపాటు ప్రత్యామ్నాయ ఎజెండా ద్వారా విపక్షాలను సమీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలనేది అమిత్‌షా వ్యూహమని వారంటున్నారు. ఇందులో భాగంగా రేవంత్‌రెడ్డికి, రాజగోపాల్‌రెడ్డికి మధ్యనున్న విభేదాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని అమిత్‌షా భావిస్తున్నారని తెలుస్తోంది.

MP Komatireddy : టీఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తులపై కోమటిరెడ్డి ఏమన్నారంటే

రాజగోపాల్‌రెడ్డి కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి అనేకసార్లు బహిరంగంగానే విమర్శలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాలో రేవంత్‌రెడ్డి సభ పెట్టకుండా ప్రయత్నించడం వంటి పరిణామాల నేపథ్యంలో తాను కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాజగోపాల్‌రెడ్డి సంకేతాలిచ్చినట్టు తెలిసింది. దీనిని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. రాజగోపాల్‌రెడ్డిని అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ను రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేసేలా అమిత్‌షా వ్యూహం పన్నినట్టు సమాచారం.