Telangana Cong : టీడీపీ వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..ఇంతే మరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

టీడీపీ నుంచి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..పరిస్థితి ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించడం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది...ఇప్పటికైనా అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఉద్యమం

Telangana Cong : టీడీపీ వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..ఇంతే మరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy

Komati Reddy Rajagopal Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు వల్లే గాంధీ భవన్‌కు వెళ్లడం లేదన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..పరిస్థితి ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించడం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. 2022, మార్చి 11వ తేదీ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తిని నిలబెడితే..క్రెడిబులిటీ ఉండదని…నిజాయితీ పరులు, ఉద్యమంలో కొట్లాడిన వారికి పార్టీ పగ్గాలు ఇస్తే బాగుండేదన్నారు.

Read More : Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్_లో అసలు ఏం జరుగుతోంది?

ఎమ్మెల్యేలను నిలబెట్టగలిగే నాయకుడు లేరని…ఇప్పటికైనా అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా కొట్లాడారో.. ఇప్పుడు టీఆర్ఎస్‌పై పోరాడాలన్నారు రాజగోపాల్ రెడ్డి. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై తనకు కోపం లేదని.. అలాగని అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టడం లేదన్నారు. తన బాధంతా తెలంగాణ కోసం కష్టపడిన వారికి పదవి ఇస్తే మరింత ఉపయోగం ఉండేదన్నారు. తెలంగాణ ఇచ్చాక మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుడిగా మంత్రివర్గంలో పని చేసిన పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పగ్గాలు ఇవ్వడం వల్లే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని ప్రజలు అనుకున్నా..సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

Read More : T Congress: తెలంగాణ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు

తెలంగాణ కాంగ్రెస్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంటుంది. అంతర్గత విబేధాలు, గ్రూప్ పాలిటిక్స్ లతో పార్టీ మరింత కష్టాల్లో పడుతోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం అనంతరం నేతల మధ్య వైరుఢ్యాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భిన్న ధృవాలుగా పేరుంది. రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి తర్వాత మెత్తపడ్డారు. స్వయంగా రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇటీవలే కలిశారు. దీంతో పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. కానీ.. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. దీనిపై ఎలాంటి రెస్పాండ్ వస్తుందో వెయిట్ అండ్ సీ.