MP Komatireddy : టీఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తులపై కోమటిరెడ్డి ఏమన్నారంటే

రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. కానీ.. జాతీయస్థాయిలో పొత్తులు ఉంటాయని...పార్టీ బలంగా లేని నిజామాబాద్, ఆదిలాబాద్ లలో మీటింగ్ పెడితే బాగుటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు...

MP Komatireddy : టీఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తులపై కోమటిరెడ్డి ఏమన్నారంటే

Komati Reddy

TRS And Congress Alliance Comments : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయా ? ఈ రెండు పార్టీలి కలిసిపోయి.. ప్రజల దగ్గరకు వెళుతాయా ? అనే చర్చలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరుతారని తొలుత ప్రచారం జరిగినా.. ఆయన నో చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ.. ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ పై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తులపై ఆయన పలు సూచనలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పొత్తులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. కానీ.. జాతీయస్థాయిలో పొత్తులు ఉంటాయని పత్రికల్లో చూశానని.. దీనిపై క్లారిటీ రావాలంటే.. ఢిల్లీకి వెళితే తెలుస్తుందన్నారు. పోత్తు కోసం సీఎం కేసీఆర్ సంప్రదించినా.. హై కమాండ్ ఒప్పుకోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్టీలోని విలీనం చేస్తానని చెప్పి ఆయన మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. కాంగ్రెస్ పార్టీలో సలహాదారుగా ఉంటానని పీకే చెప్పినట్లు తెలిసిందని.. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు తాను చేయనన్నారు.

Read More : Komatireddy venkat reddy: రేపటి రేవంత్ ప్రోగ్రాంకు నేను హాజరుకాను.. నా నియోజకవర్గంలో..

ఇక మే 06వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇందుకు టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కోమటిరెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ సభకు పూర్తిస్థాయిలో అన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతోందని తెలిపారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో స్వచ్చందంగా ప్రజలు ఈ సభలో పాల్గొంటారని.. ఈ సభ చరిత్రలో నిలుస్తుందన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి నెలకొల్పడం జరిగిందని, ఈ జిల్లాల్లో నాయకులతో తాను మాట్లాడడం జరిగిందన్నారు. ఇక్కడకు రావడం కంటే.. ఆ రెండు జిల్లాలకు వెళితే బాగుంటుందని పరోక్షంగా టీపీసీసీ చీఫ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ జిల్లాలో ప్రిపరేషన్ మీటింగ్ అవసరం లేదని.. పెద్ద పెద్ద లీడర్లు ఇక్కడ ఉన్నామన్నారు. నాగార్జున సాగర్ లో పీసీసీ తో జానారెడ్డి మీటింగ్ పెట్టిస్తున్నట్లు.. ఈ సమావేశానికి తాు హాజరు కావడం లేదని.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పర్యటన కారణంగా చెప్పారు. పార్టీ బలంగా లేని నిజామాబాద్, ఆదిలాబాద్ లలో మీటింగ్ పెడితే బాగుటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.