Bandi Sanjay: టీఆర్ఎస్ స‌ర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ ద‌ర‌ఖాస్తులు

తెలంగాణ‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ మరో అస్త్రం ప్ర‌యోగించింది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి సంబంధించిన అనేక విష‌యాల‌ను తెలుసుకునేందుకు బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నేతృత్వంలో ఆ పార్టీ స‌మాచార హ‌క్కు చ‌ట్టం (ఆర్టీఐ) కింద 88 దర‌ఖాస్తులు చేసుకుంది.

Bandi Sanjay: టీఆర్ఎస్ స‌ర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ ద‌ర‌ఖాస్తులు

Bandi Sanjay

Bandi Sanjay: తెలంగాణ‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ మరో అస్త్రం ప్ర‌యోగించింది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి సంబంధించిన అనేక విష‌యాల‌ను తెలుసుకునేందుకు బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నేతృత్వంలో ఆ పార్టీ స‌మాచార హ‌క్కు చ‌ట్టం (ఆర్టీఐ) కింద 88 దర‌ఖాస్తులు చేసుకుంది. ప్ర‌భుత్వం నుంచి అన్ని శాఖ‌ల‌కు సంబంధించి బీజేపీ ప్ర‌శ్న‌లు అడిగింది. జిల్లాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, 2014, 2018 ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి బీజేపీ స‌మాధానాలు కోరింది.

Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

వీటిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందోన‌న్న‌ ఆసక్తి నెల‌కొంది. ఒక వేళ ప్ర‌భుత్వం సమాధానం చెబితే మరిన్ని ప్రశ్నలు అడ‌గాల‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల గురించి ప్ర‌జ‌ల‌కు గుర్తు చేయ‌డానికి, ప్రభుత్వ పాల‌న‌లోని వైఫల్యాలను వెలికి తీయడానికి బీజేపీ ఆయా ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.