Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఝార్ఖండ్‌పై మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం నిన్న‌ మధ్యప్రదేశ్‌పైకి విస్తరించింద‌ని, దానికి అనుబంధంగా 5.8 కిలో మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

Rain

Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఝార్ఖండ్‌పై మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం నిన్న‌ మధ్యప్రదేశ్‌పైకి విస్తరించింద‌ని, దానికి అనుబంధంగా 5.8 కిలో మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

Sasikala : శశికళకు షాక్…బినామీ ఆసల్తు జప్తు చేసిన ఆదాయపన్ను శాఖ

బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం 4.5 కిలో మీటర్ల ఎత్తున ఏర్పడిందని, తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయ‌ని వివ‌రించారు. నిన్న‌ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మ‌ధ్య అనేక‌ ప్రాంతాల్లో భారీగా వ‌ర్షం ప‌డిందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోని కంగ్టిలో 8.7, మహబూబ్‌నగర్‌లోని కొత్తమొల్గరలో 7.9 సెంటీమీట‌ర్ల‌ వర్షం ప‌డింద‌ని వివ‌రించారు.