Site icon 10TV Telugu

Ramchander Rao: చాలామంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు, రిజర్వేషన్లు కాంగ్రెస్ వల్ల కాదు- రామచంద్రరావు

Ramchander Rao

Ramchander Rao: సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సీఎం రేవంత్ మాటలన్నీ ఉత్తర కుమార ప్రగల్బాలు అని విమర్శించారు. కాంగ్రెస్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని దించే స్థాయి కాంగ్రెస్ కు లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు కాంగ్రెస్ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని వ్యాఖ్యానించారు.

”బీసీ రిజర్వేషన్ల నుండి ముస్లింలను తప్పిస్తే మేము మద్దతిస్తామని చెబుతున్నాము. నిన్నటి నుండి బీసీ రిజర్వేషన్ల పదం ఏంటో చూపించాలని కాంగ్రెస్ మాట్లాడుతోంది. బీజేపీలో చేరేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఎల్లుండి గువ్వల బాలరాజు బీజేపీలో చేరుతున్నారు. అనేకమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. వారి వారి పార్టీలలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అవకాశం చూసుకుని వారే రాజీనామా చేసి వస్తామని అంటున్నారు. జిల్లా పర్యటలో గొడవలు జరుగుతున్నాయి. వాస్తవమే, అవన్నీ సాధారణం. పార్టీ రోజురోజుకు బలపడుతుంది. అధికారంలోకి రాబోతోంది. అందుకే నాయకులు గొడవపడుతున్నారు. వారందరినీ సమన్వయం చేస్తున్నాం. గొడవలన్నీ సద్దుమణిగిపోతున్నాయి. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. అవన్నీ కామన్” అని రామచంద్రరావు అన్నారు.

Also Read: భార్యాభర్తల మాటలూ విన్నారు.. వేల కోట్లు దోచుకున్నారు.. సీబీఐకి అప్పగించాలి- ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version