Narayanpet District: నారాయణ పేట్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కలకలం చెలరేగుతోంది.
తన భర్తను బెదిరించారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని మహాదేవప్ప భార్య సత్తమ్మ తెలిపారు. మహాదేవప్ప గెలుస్తారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ రావడంతో అపోజిట్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయనను వేధించారని, వారి టార్చర్ తట్టుకోలేకపోవడం వల్లే ఉరి వేసుకున్నారని చెప్పారు.
తన తండ్రికి బెదిరింపు కాల్స్ రావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మహాదేవప్ప కూతురు ఏడుస్తూ వివరించింది. చంపేస్తామంటూ తన తండ్రికి బెదిరింపులు వచ్చాయని చెప్పింది. ఏ పార్టీకి చెందిన నాయకులు మహదేవ్‌ని బెదిరించారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మక్తల్‌కు బయలుదేరారు. ఆత్మహత్య ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నేరుగా వెళ్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు, పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. మరోవైపు, డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Rahul Gandhi, CM Revant Reddy & Congress party are responsible for the tragic death of Erukala Mahadevappa, BJP’s Ward-6 candidate from Makthal — a son of a humble Scheduled Tribe family who dared to stand up for democracy. His death has shaken the conscience of Telangana.… pic.twitter.com/JwF3ASL22e
— BJP Telangana (@BJP4Telangana) February 10, 2026