Nude Videos : న్యూడ్ వీడియాలతో యువతి బ్లాక్ మెయిల్, వేధింపుల తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

నగ్నంగా ఉండే యువతులతో వాట్సాప్ లో మాట్లాడించి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునే గ్యాంగ్ ల అరాచకాలు పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో ఇదో పెద్ద దందాగా మారింది. యువతులు ఫోన్ చేస్తారు. నగ్నంగా చూపిస్తారు. న్యూడ్ గా కనిపించేలా కవ్విస్తారు. అంతే, ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.

Nude Videos Blackmail

Nude Videos Blackmail : నగ్నంగా ఉండే యువతులతో వాట్సాప్ లో మాట్లాడించి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునే గ్యాంగ్ ల అరాచకాలు పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో ఇదో పెద్ద దందాగా మారింది. యువతులు ఫోన్ చేస్తారు. నగ్నంగా చూపిస్తారు. న్యూడ్ గా కనిపించేలా కవ్విస్తారు. అంతే, ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. మరో దారి లేక అడిగినంత ఇచ్చుకోవాలి. ఇలా చాలామంది పరువు పోతుందనే భయంతో వారు అడిగినంత డబ్బు ఇచ్చారు. కొందరు మాత్రం.. అడిగినంత డబ్బు ఇవ్వలేక, వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి విషాదం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

నేను సింగిల్.. నాతో చాట్ చేస్తావా?
నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన యువకుడు(22) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ వృత్తి విద్య చదువుతున్నాడు. కొన్ని రోజుల కిందట అతని ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘నేను సింగిల్ లేడీని. మీతో చాట్‌ చేయాలనుకుంటున్నా’ అని అందులో ఉంది. దీంతో ఆ విద్యార్థి స్పందించాడు. వారు పంపిన ఫోన్‌ నెంబర్ ను కాంటాక్ట్ అయ్యాడు. అవతలి వైపు నుంచి యువతి వాయిస్ వినిపించింది. యువకుడిని కవ్విస్తూ మాట్లాడింది. అతడు కూడా ఫార్వర్డ్ అయ్యాడు. ఆపై వీడియో కాల్‌చేసిన యువతి నగ్నంగా కనిపిస్తూ చాటింగ్‌ చేసింది. అంతేకాదు ‘నాకు నగ్నంగా చూడమే ఇష్టమంటూ’ యువకుడినీ కవ్వించింది. దీంతో అతగాడు రెచ్చిపోయాడు. దుస్తులన్నీ ఇప్పేసి చూపించాడు. అయితే, ఆ యువతి చేస్తున్న మోసం అతడు గ్రహించలేదు. అతడిని రెచ్చగొట్టి దుస్తులు విప్పించిన కిలేడీ, అతగాడి న్యూడ్ దృశ్యాలను సీక్రెట్ గా ఫోన్ లో రికార్డు చేసింది.

డబ్బు కోసం వేధింపులు:
గుర్తు తెలియని యువతి ఫోన్ చెయ్యడం, నగ్నంగా విప్పి చూపించడం.. దీంతో ఆ యువకుడు తెగ సంతోషించాడు. ఆహా ఏమి నా అదృష్టం.. అమ్మాయి మొత్తం చూపించింది అని ఆనందపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. కాసేపట్లోనే ఆవిరైంది. తాను సమస్యలో చిక్కుకున్నానని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు.

రూ.24వేలు ఇచ్చుకున్నా ఆగని వేధింపులు:
న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన యువతి.. అసలు కథ షురూ చేసింది. అతడిని డబ్బు పంపాలని డిమాండ్‌ చేసింది. దీంతో ఆ యువకుడు షాక్ తిన్నాడు. అయినా ఆమెని లైట్ తీసుకున్నాడు. దీంతో కిలేడీ మరింత రెచ్చిపోయింది. అతడి నగ్నవీడియోలు అతడికి వాట్సాప్ చేసింది. అంతే, మనోడి ఫ్యూజులు ఎగిరాయి. ఒళ్లంతా చెమట్లు పట్టాయి. గుండె వేగం పెరిగింది. నేను అడిగిన డబ్బు ఇస్తావా లేక నీ నగ్న వీడియోలు యూట్యూబ్‌లో పెట్టమంటావా అని ముఠా సభ్యులతో కలిసి యువతి బెదిరించింది. దీంతో ఆ యువకుడు భయపడ్డాడు. పరువు పోతుందని ఆందోళన చెందాడు. తన బ్యాంకు అకౌంట్ లో ఉన్న రూ.24 వేలు వారిచ్చిన ఖాతాకు బదిలీ చేశాడు. అయినా బెదిరింపులు ఆగలేదు. ఇంకా డబ్బు కావాలంటూ తరచూ ఫోన్‌ చేసి వేధించారు. దీంతో ఆ విద్యార్థికి టెన్షన్ పట్టుకుంది. తన దగ్గర డబ్బులు అయిపోయాయి. ఇంకా డబ్బులు అడుగుతోంది. ఎక్కడి నుంచి తేవాలో పాలుపోలేదు. పోనీ సైలెంట్ గా ఉందామా అంటే, వీడియోలు లీక్ అయితే పరువుపోతుందని భయం పట్టుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేద్దామా అంటే, ఇంట్లో వాళ్లకు తెలిస్తే తలెత్తుకునే పరిస్థితి ఉండదని భావించాడు. ఇలా అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

వేధింపులు తాళలేక సూసైడ్:
ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట స్వగ్రామానికి వెళ్లాడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. చావే ఈ సమస్యకు పరిష్కారం అని డిసైడ్ అయ్యాడు. సూసైడ్ చేసుకోవాలని నిశ్చయించాడు. ఓ రోజు తెల్లవారుజామున పొలం దగ్గర పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా లాభం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మంగళవారం(మార్చి 30,2021) రాత్రి యువకుడు మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

కక్కుర్తి ఖరీదు రూ.10లక్షలు:
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ఇలాంటి తరహా మోసమే ఒకటి వెలుగుచూసింది. ఓ మాయ లేడీ.. న్యూడ్ వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేసి ఈవెంట్ మేనేజర్ నుంచి రూ.10లక్షలు గుంజింది. అయినా ఆమె ఆశ తీరలేదు. ఇంకా డబ్బు కావాలని బెదిరింపులకు దిగడంతో బాధితుడు మరోదారి లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త:
ఇటీవల ఈ తరహా మోసాలు బాగా పెరిగాయి. ముందు ఫోన్ కి మెసేజ్ పంపుతారు. నాతో చాట్ చేయాలంటే ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి అని అడుగుతారు. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్ తీసుకుంటారు. అందులో ఓ యువతి న్యూడ్ గా కనిపిస్తుంది. న్యూడ్ గా కనిపించేలా అవతలివారిని రెచ్చగొడుతుంది. ఏమాత్రం లొంగినా, ఇక అంతే. ఇలాంటి ముఠాల చేతికి చిక్కి చాలామంది మోసపోతున్నారు. కక్కుర్తి పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అడిగినంత డబ్బు ఇవ్వలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో లేదా ఫోన్ లో అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతూనే ఉన్నారు. అలాంటి వాటికి స్పందించొద్దని, వారితో చాటింగ్ చేయొద్దని కోరుతున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.