Bride
Bride’s Father Died From Heart Attack In Jagtial : పెళ్లింట విషాదఛాయలు అలుముకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కారణాలతో చనిపోతున్నారు. దీంతో ఎంతో సందడి సందడిగా కనిపించాల్సిన ఇళ్లు రోదనలు మిన్నంటుతున్నాయి. మొన్న..అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి బృందంతో వెళుతున్న కారు.. లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గుండెపోటుతో వరుని తండ్రి మృతి చెందాడు. గత సంవత్సరమే అతని చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. దీంతో వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
Read More : Gold Seized : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్
జగిత్యాల పట్టణంలోని RNT నగర్ లో ఆంజనేయులు కుటుంబం నివాసం ఉంటోంది. ఇతని కుమారుడికి వివాహం నిశ్చయించారు. పెళ్లి పనులు కొనసాగుతున్నాయి. వరుడి తండ్రి ఆంజనేయులు పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే..2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం తెల్లవారుజామున పెళ్లి పనులు జరుగుతున్నాయి. కొద్దిగంటల్లో వివాహం జరుగుతుందని అనుకుంటున్న క్రమంలో ఆంజనేయులు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. అప్పటి వరకు ఎంతో సందడిగా..సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి. గత సంవత్సరమే ఆంజనేయులు చిన్న కుమారుడు ఎస్సారెస్పీ కెనాల్ లో సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. స్థానికంగా ఈ ఘటన విషాదం నింపింది.