KCR : పెద్ది కుటుంబానికి అండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం
Peddi Sudarshan Reddy Family : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
- Harish Thanniru
- Updated on- August 8, 2026 / 02:16 PM IST
Peddi Sudarshan Reddy Family
Peddi Sudarshan Reddy Family : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. పెద్ది మృతితో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచారు. పార్టీ తరపున ఆయన కుటుంబానికి రూ.2.25కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.
Also Read : Bengaluru : ఇద్దరు అమ్మాయిల ప్రేమాయణం.. తల్లిదండ్రులను ఎదిరించి.. చివరకు విషాదాంతం
వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ క్రమంలో పెద్ది కుటుంబానికి అండగా నిలిచేందుకు నిర్ణయించినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. పిల్లల భవిష్యత్తు, చదువులకు ఈ మొత్తం ఉపయోగపడేలా చర్యలు తీసుకోనున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో మొత్తంగా రూ.2.25 కోట్లను కుటుంబానికి పార్టీ తరఫున ఆర్థిక సహాయంగా అందించనున్నారు.
ఆర్థిక సహాయంతోనే పార్టీ బాధ్యత ముగియదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, వారి విద్య, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా ఉంటుందని తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలు పూర్తైన తర్వాత వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యనేతలు సమావేశమై కుటుంబానికి అందించాల్సిన ఇతర సంక్షేమ కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకుందామని, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఎల్లకాలం బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేసినట్లు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పేర్కొన్నారు.
