Shankar Naik
BRS Ex MLA Shankar Naik : తరచు వివాదాల్లో ఉండే మహబూబాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.తన జోలికి ఎవరన్నా వస్తే సహించేది లేదని వస్తే తన సత్తా ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. గూడూరులో బీఆర్ఎస్ విస్తృతస్థాయిన సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతు..నియోజకవర్గంలో సత్తా చాటుతానని తాను ఎవరి జోలికి వెళ్లనని తన జోలికి ఎవరన్నా వస్తే సహించేది లేదంటూ వ్యాఖ్యానించారు. నియోజవర్గంలో ఎక్కడ చూసినా తాను చేసిన అభివృద్ధే కనిపిస్తోందని ఇక్కడ తానేంటో చూపిస్తాను అని వ్యాఖ్యానించారు. తన జోలికి వస్తే ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను అంటూ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎన్నికలు బీఆర్ఎస్ ఓటమి తరువాత నిర్వహించిన తొలి సమావేశంలో శంకర్ నాయక్ వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు. మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులు కంట తడి పెట్టుకున్నారు. దీంతో శంకర్ నాయక్ మాట్లాడుతు..తానేంటో చూపిస్తానని నేతలు..కార్యకర్తలు ఎవ్వరు ఆందోళన చెందవద్దు అంటూ భరోసా ఇచ్చారు. దీంతో సమావేశంలో పాల్గొన్నవారంతా చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కు అభివృద్ధి చేయటం చేతకాదంటు విమర్శించారు. మహబూబాబాద్ నియోజవర్గంలో తన సత్తా చూపిస్తానని అన్నారు.