KCR: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే, జీవన్ రెడ్డికి కీలక పదవి- కేసీఆర్

రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికే జీవన్ రెడ్డి సేవలు అందించబోతున్నారని పేర్కొన్నారు.

  • Updated on- April 20, 2026 / 08:23 PM IST

KCR: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. నూటికి నూరు శాతం వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారాయన. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. జీవన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు కేసీఆర్. అంతేకాదు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమించారు. జీవన్ రెడ్డి గుండె ధైర్యంతో నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరం అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికే జీవన్ రెడ్డి సేవలు అందించబోతున్నారని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికతో తీవ్ర ప్రభావం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. చాలా విషయాల్లో ఎంతోమందికి జీవన్ రెడ్డి ఆదర్శనం అన్నారు. జగిత్యాల అభివృద్ధిని జీవన్ రెడ్డి ఎప్పుడూ విస్మరించలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జీవన్ రెడ్డికి మంచి పదవి, మంచి హోదా ఇస్తానన్నారు.

Also Read: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ రాజకీయ ప్రయోజనం పొందారు- సీఎం రేవంత్