Dasoju Sravan : కాంగ్రెస్ నేతలవి లేకిబుద్ధులు, కర్ణాటక నేతలకు తెలంగాణలో ఏం పని? : దాసోజు శ్రవణ్

అధికారం లేకుండానే కాంగ్రెస్ నేతలు లేకితనంతో చిల్లర ప్రచారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సంప్రదాయాలు తెలియకుండా క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Dasoju Sravan

Dasoju Sravan on Exit Polls : ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. దీంతో గెలిచిన తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అప్రమత్తమయ్యారు. దీని కోసం ఢిల్లీ నుంచి అగ్రనేతలు హైదరాబాద్ కు వస్తున్నారు. చిదంబరం, సుశీల్ కుమార్, సుర్జేవాలా వంటి నేతలు హైదరాబాద్ కు రానున్నారు. అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హైదరాబాద్ కు ఈరోజు సాయంత్రానికి చేరుకోనున్నారు.

మరోపైపు బీఆర్ఎస్ కూడా గెలుపు తమదేనంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కావని, మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్‌కు exact పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుందన్నారు. అధికారం లేకుండానే కాంగ్రెస్ నేతలు లేకితనంతో చిల్లర ప్రచారాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

డిసెంబర్ 4న క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామనే విషయంపై కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. సంప్రదాయాలు తెలియకుండా క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అన్నారు.

కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ హైదరాబాద్ కు రానుండటంపై దాసోజు మాట్లాడుతూ.. కర్ణాటక నేతలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. కర్ణాటక నేతలు గద్దల్లా వచ్చి తెలంగాణకు వచ్చి పడుతున్నారు అంటూ మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు