Jagadish Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్.. సొంతపార్టీ వాళ్లే ఆయన పేరు మర్చిపోతున్నారు..!

కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కడేనని భ్రమపడుతున్నాడు. కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ విలన్.

Jagadish Reddy

Jagadish Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ ఎత్తినా, ఎత్తకపోయినా ఆయనకు భయమైంతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన పేరు మర్చిపోతున్నారు. ఒక్క మంచి పనిచేయని రేవంత్ పేరు ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారు.. రేవంత్ వల్ల బాధించబడిన వారే ఆయన్ను ఓడించేందుకు గుర్తు పెట్టుకుంటారు అంటూ జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.

 

కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కడేనని భ్రమపడుతున్నాడు. కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ విలన్. పదవిరాగానే సోనియాగాంధీని బలి దేవతన్న మాటలు మరిచిపోయావా..? అధికారం కోసం ఎంతకైనా దిగజారే నైజం నీది అంటూ రేవంత్ పై జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

 

కేసీఆర్ పై చిల్లర మాటలుమాని హామీలు అమలు సంగతి చూడు. పదేళ్లు మాదే అధికారం అన్నవాళ్లకి కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉంటే భయమెందుకేస్తుంది..? ఎన్నిరోజులు పదవిలో ఉంటాడో రేవంత్ రెడ్డికే తెలియదు. అలవికాని హామీలు ఇచ్చి అమలు చేయలేకే విమర్శలు చేస్తున్నారంటూ రేవంత్ వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.