నా మొబైల్ ఫోన్‌ను బలవంతంగా సీజ్ చేశారు: బీఆర్ఎస్ నేత క్రిశాంక్

పోలీసులు ఫోన్‌ను వెంటనే న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని అన్నారు.

పోలీసులు తన మొబైల్ ఫోన్‌ను బలవంతంగా సీజ్ చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లనే తాను సోషల్ మీడియాలో పెట్టానని తెలిపారు.

మహానందరెడ్డి ఎవరో తమకు తెలియదని సీఎంఓ చెప్పిందని క్రిశాంక్ అన్నారు. విచారణ పేరుతో ఫోన్లను సీజ్ చేయడం సరికాదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆక్రమ వ్యాపారాలపై ఎన్నో కీలక డాక్యుమెంట్లు ఆ ఫోన్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

పోలీసులు ఫోన్‌ను వెంటనే న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని అన్నారు. మహానంద రెడ్డితో రేవంత్ రెడ్డికి ఉన్న వ్యవహారాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, క్రిశాంక్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం వేధింపులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే

ట్రెండింగ్ వార్తలు