KTR and Bandi sanjay
KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: Vasireddy Padma: వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు
అక్టోబర్ 19వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారని నోటీసుల్లో పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసుల్లో కేటీఆర్ తెలిపారు.
Also Read: Elon Musk : పిల్లల్ని వెంటనే కనండి.. పెంపకం ఖర్చుపై ఆందోళన వద్దు : ఎలన్ మస్క్
కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇష్టానుసారంగా తన పరువునకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నోటీసుల్లో కేటీఆర్ హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయబడ్డాయని, దీని కారణంగా ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారంరోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
బండి సంజయ్ స్పందిస్తూ..
కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక లీగల్ నోటీసులా..? విమర్శలకు నోటీసులే సమాధానమా.. అంటూ సంజయ్ ప్రశ్నించారు. నేను కూడా నోటీసులు పంపుతా.. కాచుకో. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చా. మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.