MLA Seethakka : రాహుల్ రాకను తట్టుకోలేక.. ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు పెట్టి నిర్బంధిస్తున్న బీఆర్ఎస్ : ఎమ్మెల్యే సీతక్క

బస్సులు రాకుండా బస్సులనివ్వకుండా ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం అత్యంత హేయమైన చర్యగా అభిర్ణించారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.

Seethakka

Seethakka Fired BRS : ప్రజల కోసం, ప్రజా సమస్యలపై దేశం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే.. బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక ఎక్కడికక్కడ నిర్బంధంతో చెక్ పోస్ట్ లు పెట్టి నిర్బంధిస్తున్నారని విమర్శించారు.

బస్సులు రాకుండా బస్సులనివ్వకుండా ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం అత్యంత హేయమైన చర్యగా అభిర్ణించారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను ప్రైవేటు మీటింగ్ లు, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో కార్యకర్తలుగా ఉపయోగించుకొని ఈరోజు పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకొని తమ సభను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kotikalapudi Govinda Rao : జగన్ లా ఒక్కక్షణం కూడా పవన్ కళ్యాణ్ కు జీవించాలని లేదు : కొటికలపూడి గోవిందరావు

దీన్ని తెలంగాణ సమాజం ఖండించాలని కోరుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులారా ఇది పద్ధతి కాదని హితవు పలికారు. “చేతిలో మీ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబద్ధార్.. తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో కచ్చితంగా బుద్ధి చెబుతారు” అని హెచ్చరించారు. ప్రజలు చెల్లించే పన్నులతో వచ్చే జీతంతో మీరు డ్యూటీలు చేస్తున్నారని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

“మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు” అని పోలీసులు, అధికారులకు సూచించారు. అధికారులు నిష్పక్షపాతంగా, నీతింగా వ్యవహరించాలని కోరారు. పోలీసులు ఒక పార్టీకి తోత్తులుగా మారి తమ పార్టీ మీటింగ్ ను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలు. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు