Indrakaran Reddy : తెలంగాణలో ఓడిపోయిన ఆరుగురు మంత్రులు

తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ministers

Indrakaran Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆరుగురు మంత్రులు ఓడిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ ఓటమి పాలయ్యారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో పరాభవం పాలయ్యారు. వనపర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి టి. మేఘారెడ్డి నిరంజన్ రెడ్డిపై విజయం సాధించారు.

కాగా, బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు. బాల్కొండలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. మూడు వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదద్ గెలుపొందారు.

V Hanumantha Rao : కేసీఆర్‎పై తెలంగాణ ప్రజల తిరుగుబాటు

తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుామార్ రెడ్డి,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో జారే ఆధినారాయణ ఘన విజయం సాధించారు.

ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపొందారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై రాజ్ ఠాకూర్ విజయం సాధించారు. మంథినిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలిచారు.

ట్రెండింగ్ వార్తలు