BRS MLA Shekhar Reddy: తొలిరోజు గంటన్నరలోనే ఐటీ దాడులు పూర్తయ్యాయి.. కావాలనే మూడు రోజులు చేశారు..

ఐటీ రైడ్స్ మొదటి రోజు ఒక గంటన్నరలోనే పూర్తయ్యాయి. కావాలనే ఐటీ అధికారులు మూడు రోజులు కాలయాపన చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆరోపించారు.

BRS MLA Shekhar Reddy

Bhuvanagiri BRS MLA: గత మూడు రోజులుగా నాపై కుట్రపూరితంగానే ఐటీ రైడ్స్ జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నాపై జరుగుతున్న పలు ఆరోపణలు నిజం కాదన్నారు. ఐటీ రైడ్స్ మొదటి రోజు ఒక గంటన్నరలోనే పూర్తయ్యాయి. కావాలనే మూడు రోజులు కాలయాపన చేశారంటూ ఆరోపించారు. నాకు విదేశాలలో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయనేది అవాస్తవం అని చెప్పారు. ఐటీ అధికారులకు నేను పూర్తిగా సహకరించాను. నాపై కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా ఈ ఐటీ దాడులు జరిగాయని ఫైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు.

Income Tax Raids : అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలో ముగిసిన ఐటీ అధికారుల సోదాలు

నేను 1998 నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవని చెప్పారు. ఐటీ అధికారులకు వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో నిరుత్సాహం‌తో వెనుదిరిగి వెళ్లిపోయారని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. తనకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారని, విచారణలో భాగంగా ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానని శేఖర్ రెడ్డి తెలిపారు. నాకోసం మూడు రోజులుగాఉన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఫైళ్ల శేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Income Tax Raids : పైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి నివాసాలపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. గత బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు శుక్రవారం అర్ధరాత్రి 2గంటలకు ముగిశాయి. అయితే, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో తొలిరోజే సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు మూడు రోజులు సోదాలు నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు