Harish Rao on Siddipet Offer : సిద్దిపేట ఆఫర్: నువ్వే రా చూసుకుందాం.. రేవంత్ రెడ్డికి హరీశ్ ఆఫర్
Harish Rao on Siddipet Offer : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సిద్దిపేట ఆఫర్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
- Dharani Pilli
- Published On : March 25, 2026 / 03:50 PM IST
brs mla harish rao counter cm revanth reddy on siddipet minister offer
Harish Rao on Siddipet Offer : వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను మంత్రి చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “సిద్దిపేట నుంచి గెలిచిన వారిని మంత్రిని చేస్తానన్నావు.. ఎవరో ఎందుకు.. నువ్వే పోటీ చేయ్” అంటూ సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘తల్లకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాడు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఎప్పుడు గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు. మళ్ళీ సీఎం అవుతానని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడు. వాళ్లు వీళ్లు ఎందుకు.. సిద్దిపేటలో నాపై పోటీకి రేవంత్ రెడ్డే రావాలి. ఆయనకిదే ఆఖరి టర్మ్’’ అన్నారు.
‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ.. అన్ని వర్గాలను రేవంత్ మోసం చేశారు. రైతులను సైతం ముఖ్యమంత్రి రేవంత్ మోసం చేశారు. డీలిమిటేషన్‌తో బీఆర్ఎస్ కు మేలు జరుగుతుంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను మేము స్వాగతిస్తున్నాం. కుటుంబ నియంత్రణను పద్ధతిగా పాటించినందుకు దక్షిణాదికి ఆర్థికంగా, రాజకీయంగా నష్టం జరుగుతోంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తారో లేదో చెప్పటం కన్నా.. చూస్తేనే బాగుంటుంది’’ అన్నారు.
