TG KGBV 2026 : KGBVల్లో ప్రవేశాలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.. మీరు అప్లై చేశారా..?
TG KGBV 2026 : పదో తరగతి విద్యార్థినిలకు అలర్ట్.. కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
telangana kgbv 2026 admission notification april 15 is last date
TG KGBV 2026 : మీరు కేజీబీవీ (KGBV)ల్లో చేరాలని భావిస్తున్నారా? అయితే ఇంకా దరఖాస్తు చేయలేదా? త్వరపడండి! అప్లై చేసుకోవడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆలస్యం చేస్తే మంచి అవకాశం కోల్పోతారు. తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) అడ్మిషన్ల దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు.. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివేందుకు గాను, ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల విద్యాలయాల సంస్థ వెల్లడించింది. రేపు, అంటే బుధవారంతో దరఖాస్తు గడువు ముగుస్తుంది.
ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 93 కేజీబీవీ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. ప్రధానంగా ఎంపీసీ (MPC), బైపీసీ (BPC), సీఈసీ (CEC) గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విద్యాలయాల్లో ప్రభుత్వం నాణ్యమైన బోధన అందిస్తుంది.
ఇదిలా ఉంటే, తెలంగాణ సర్కార్ ఈ 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ‘యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్’ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే వీటిలో ఇంటర్మీడియట్ బోధనతో పాటు నీట్ (NEET), ఐఐటీ-జేఈఈ (IIT-JEE), క్లాట్ (CLAT) వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ కూడా అందించనున్నారు. కనుక ఆసక్తిగల విద్యార్థినులు ఏప్రిల్ 15, 2026 లోపు tgrjc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ప్రవేశ పరీక్ష మే 5, 2026న జరుగుతుంది.
