Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

BRS MLA Koushik Reddy

Kaushik Reddy: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో వరంగల్ సుబేదారి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం వరంగల్ కు తరలించారు. పాడి కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.

రూ.50లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బెదిరించారని పేర్కొంటూ కమలాపురం మండలం వంగపల్లిలోని క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఏప్రిల్‌లో ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. జూన్ 16న దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.

కోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం వరంగల్ కు తరలించారు.