బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నా, మీ సంగతి చూస్తా- అధికారులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చాక మీకు అన్నీ బ్లాక్ డేసే ఉంటాయి. బిడ్డా తస్మాత్ జాగ్రత్త..

Mla Kaushik Reddy : అధికారులపై ఫుల్ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అధికార పార్టీ నేతల మాటలు విని పని చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక వారి భరతం పడతామని హెచ్చరించారు. ఇలాంటి వారి కోసం తాను బ్లాక్ బుక్ ను రెడీ చేస్తున్నట్లు చెప్పారు కౌశిక్ రెడ్డి. తాము అధికారంలోకి రాగానే ఆ అధికారుల సంగతి చూస్తామన్నారు. లబ్దిదారులకు వ్యక్తిగతంగా చెక్కులు ఇవ్వరాదంటూ అధికారులకు సూచించారు. తనపై కోపం ఉంటే భరిస్తానని, హుజూరాబాద్ ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం సహించబోనని తేల్చి చెప్పారు.

”అధికారులకు హెచ్చరిస్తున్నా. జిల్లా కలెక్టర్లకి, ఆర్డీవోలకి, ఎమ్మార్వోలకు కూడా చెబుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రూల్స్ ప్రకారం వెళ్లండి. మీకు జీవో ఉంటుంది. దాని ప్రకారం ఎందుకు వెళ్లడం లేదు. మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయి? అధికారులకు వార్నింగ్ ఇస్తున్నా. తస్మాత్ జాగ్రత్త. బ్లాక్ బుక్ రెడీ చేశా. ఏ ఏ అధికారి ఎక్స్ ట్రాలు చేశారో బ్లాక్ బుక్ లో వారి పేర్లు ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చాక మీకు అన్నీ బ్లాక్ డేసే ఉంటాయి. బిడ్డా తస్మాత్ జాగ్రత్త ” అంటూ అధికారులపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. కౌశిక్ రెడ్డితో పాటు ఓ పేపర్ చీఫ్ ఎడిటర్, ఓ ఛానెల్ ఎండీకి నోటీసులు ఇచ్చారు. అడ్వకేట్ పూర్ణచందర్ ఈ నోటీసులు జారీ చేశారు. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నంపై తప్పుడు ఆరోపణలు చేశారని అడ్వకేట్ పూర్ణచందర్ అన్నారు.

Also Read : రూ.325 కోట్లతో పనులు.. డిసెంబరులోపు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు