Brs Mlc Kavitha : ఆ రోజు నుంచి.. ప్రజాక్షేత్రంలో మళ్లీ క్రియాశీలకంగా ఉండేలా కవిత యాక్షన్ ప్లాన్..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6 నెలలు జైల్లో ఉన్న కవిత.. బెయిల్ పై విడుదలయ్యారు.

Brs Mlc Kavitha (Photo Credit : Google)

Brs Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. వరుసగా యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత.. క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. మొన్న అదానీ వ్యవహారంలో స్పందించారు. ఆ తర్వాత వాంకిడి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై స్పందించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6 నెలలు జైల్లో ఉన్న కవిత.. బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలపై ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. ఇప్పుడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు కవిత ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.

జాతీయ స్థాయిలో అదానీ వ్యవహారం హాట్ హాట్ గా మారడంతో కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అలాగే రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం సర్కార్ కులగణనను మొదలు పెట్టడం, బీసీ అజెండాకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇప్పుడు ఈ అంశంపైన కూడా ఎమ్మెల్సీ కవిత దృష్టి పెట్టారు. పూలె ఫ్రంట్ పేరుతో జాగృతి ఏర్పాటు చేసిన వేదికతోనే బీసీలకు చేరువయ్యేలా కార్యాచరణ అమలు చేసేందుకు రెడీ అయ్యారు.

ఈ నెల 29 బీఆర్ఎస్ నిర్వహిస్తున్న దీక్షా దివస్ సందర్భంగా నిజామాబాద్ లో జరిగే కార్యక్రమానికి కవిత హాజరు కానున్నారు. అదే రోజు నుంచి ఇక ప్రజాక్షేత్రంలోనే క్రియాశీలకంగా ఉంటూ పోరుబాట పట్టాలని కవిత భావిస్తున్నారు. పొలిటికల్ గా కవిత యాక్టివ్ అవుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

 

Also Read : మోదీ సూపర్ సక్సెస్, రాహుల్ అట్టర్ ఫ్లాప్..! మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయానికి కారణం అదేనా?