కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ.. లిక్కర్ కేసులో ఏ రోజు ఏం జరిగిందో తెలుసా?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు 2022 ఫిబ్రవరి 21న నోటీసులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విషయంలో ఏ రోజు ఏం జరిగిందో తెలుసా?

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె ఇంటి వద్ద హైటెన్షన్

  • 2022 ఫిబ్రవరి 21
    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితకు నోటీసులు
  • 2022 ఫిబ్రవరి 26
    వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు
  • 2022 డిసెంబర్ 11
    ఇంట్లోనే కవితను విచారించిన సీబీఐ
  • 2023 మార్చి 11
    తొలిసారిగా ఈడీ విచారణకు హాజరైన కవిత
  • 2023 మార్చి 20
    రెండోసారి ఢిల్లీలో కవితను విచారించిన ఈడీ
  • 2023 మార్చి 21
    కవితను మూడోసారి విచారించిన ఈడీ
  •  మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మూడు రోజులు.. మార్చి 11, మార్చి 20, మార్చి 21 (27 గంటలపాటు)కవితను ప్రశ్నించింది ఈడీ
  • 2024 మార్చి 15
    కవితను అరెస్ట్‌ చేసిన ఈడీ అధికారులు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో మార్చి 15న ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నివాసంలో సోదాలు జరిగాయి. ఆమెను ఈడీ అరెస్టు చేసింది

Pawan Kalyan Pithapuram : పవన్ కల్యాణ్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ప్లాన్.. హాట్ హాట్‌గా పిఠాపురం పాలిటిక్స్

ట్రెండింగ్ వార్తలు