×
Ad

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. రియల్టర్‌పై కాల్పులు జరిపి.. కత్తితో పొడిచి హత్య

Hyderabad : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దండుగులు రియల్టర్ పై కాల్పులు జరిపి ..

Hyderabad

Hyderabad : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దండుగులు రియల్టర్‌పై కాల్పులు జరిపి, కత్తితో దాడిచేసి హత్య చేశారు. సాకేత్ కాలనీ ఫోస్టల్ స్కూల్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న రియల్టర్ వెంకటరత్నంపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ తరువాత కత్తితో పొడి హత్య చేశారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ హత్యపై మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ మాట్లాడుతూ.. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలతో విచారిస్తున్నట్లు చెప్పారు. వెంకటరత్నం తల, మెడ, పొట్ట భాగాల్లో దారుణంగా నరికారని, హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోందని అన్నారు. అయితే, వెంకటరత్నంపై దాడిచేసి హత్యచేసిన వారిలో ధూల్‌పేట్‌కు చెందిన రౌడీషీటర్ ఉన్నట్లు గుర్తించారు. గతంలో జంట హత్యల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. అయితే, పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.