Telangana Assembly Polls: బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఆర్ఎస్పీ పోటీ ఎక్కడి నుంచో తేలిపోయింది
వాస్తవానికి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా రోజులుగానే ఆర్ఎస్పీ అక్కడే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం తన పోటీ గురించి క్లారిటీ ఇవ్వలేదు

BSP First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. మొత్తం 20 మందితో ఈ జాబితా విడుదలైంది. అయితే మొదటి జాబితాలో తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా ఉంది. ఆయన అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా రోజులుగానే ఆర్ఎస్పీ అక్కడే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం తన పోటీ గురించి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా విడుదల చేసిన మొదటి జాబితాతో ఆయన పోటీపై స్పష్టత వచ్చింది.
BSP’s first list of contesting candidates as MLA in 20 Assembly constituencies..#VR99 #LiberateTelangana pic.twitter.com/hsrVXMy2C0
— BC Voice (@Voice2Bc) October 3, 2023
బీఎస్పీ అభ్యర్థులు వీరే
1. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ – సిర్పూర్
2. జంగం గోపి – జహీరాబాద్
3. దాసరి ఉష – పెద్దపల్లి
4. చంద్రశేఖర్ ముదిరాజ్ – తాండూర్
5. వెంకటేష్ చౌహాన్ – దేవరకొండ
6. కొంకటి శేఖర్ – చొప్పదండి
7. అల్లిక వెంకటేశ్వర్ రావు – పాలేరు
8. మేడి ప్రియదర్శిణి – నకిరేకల్
9. బానోత్ రాంబాబు నాయక్ – వైరా
10. నక్క విజయ్ కుమార్ – ధర్మపురి
11. నాగమోని చెన్నరాములు ముదిరాజ్ – వనపర్తి
12. నిషాని రామచంద్రం – మానకొండూరు
13. పిల్లుట్ల శ్రీనివాస్ – కోదాడ
14. కొత్తపల్లి కుమార్ – నాగర్ కర్నూల్
15. బన్సిలాల్ రాథోడ్ – ఖానాపూర్
16. ముప్పరపు ప్రకాషం – ఆందోల్
17. వట్టె జానయ్య యాదవ్ – సూర్యపేట
18. గొర్లకాడ క్రాంతి కుమార్ – వికారాబాద్
19. ఎర్ర కామేష్ – కొత్తగూడెం
20. ప్రాద్య కుమార్ మాధవరావు ఏకాంబరం – జుక్కల్