కేటీఆర్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తను తీవ్రంగా కొట్టిన ఎస్సై? కేటీఆర్ స్పందన

రమేశ్‌ మిత్రుడు నవీన్‌ ఈ విషయంపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్‌ స్పందించారు.

KTR

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడేనికి చెందిన మాదగోని రమేశ్‌ అనే బీఆర్ఎస్ కార్యకర్తను ఎస్సై అంతిరెడ్డి తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాట్సాప్‌ స్టేటస్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రసంగాన్ని పెట్టుకోవడంతోనే తనను నార్కట్‌పల్లి ఎస్సై రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌కు పిలిచి తిడుతూ బెల్టుతో కొట్టారని రమేశ్ తెలిపారు.

రమేశ్‌ మిత్రుడు నవీన్‌ ఈ విషయంపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్‌ స్పందించారు. ఎస్పీ చందనా దీప్తికి ఫోన్ చేసి కేటీఆర్ మాట్లాడారు. దీంతో ఎస్ఐ అంతిరెడ్డిని ఎస్పీ చందనా దీప్తి మందలించారు. ఎస్సై అంతిరెడ్డిపై మానవ హక్కుల సంఘం చైర్మన్ తిరుపతి కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. మాదగోని రమేశ్‌ కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేవలం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 Also Read: దక్షిణాదిలో ఎలాగైనా పట్టు సాధించాలన్న నిశ్చయానికి వచ్చిన బీజేపీ.. అందుకే ఇలా..

ట్రెండింగ్ వార్తలు