RS Praveen Kumar: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. కీలక పత్రాలు మాయం?

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది.

RS Praveen Kumar house

RS Praveen Kumar: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామంలో ప్రవీణ్ కుమార్ నివాసం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తరువాత ఎన్నికల సమయం ముందు ప్రవీణ్ కుమార్ ఆ నివాసాన్ని కొనుగోలు చేశారు. సిర్పూర్ పర్యటన వచ్చిన సమయంలో ఆయన అక్కడే ఉంటారు. అయితే, గత రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి విలువైన పత్రాలు దొంగిలించినట్లు తెలిసింది. ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : US Election 2024: ’చెత్త‘ ట్రక్కును నడుపుతూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన ట్రంప్.. వీడియో వైరల్

ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లో ఉన్న సమయంలో స్థానికంగా కొందరు నేతలు అక్కడ ఉంటారని తెలుస్తోంది. అయితే, బుధవారం రాత్రి ఆ నివాసంలో ఎవరూ బస చేయలేదని, ప్రవీణ్ కుమార్ కూడా హైదరాబాద్ లో ఉన్నారని తెలిసింది. ఉదయాన్నే ఇంటి తాళాలు తెరిచేందుకు రాగా.. తాళాలతోపాటు లోపల బీరువా తాళాలు పగలగొట్టినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరా ఉండటంతో పోలీసులు దానిని పరిశీలించనున్నారు. అయితే, దొంగలు బీరువాలోని కీలక పత్రాలను ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు, ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ ఇప్పటి వరకు స్పందించలేదు.