Gandhi Hospital : ఇక నుంచి గాంధీ హాస్పిట‌ల్‌లోనూ ‘కాట‌రాక్ట్’ స‌ర్జ‌రీలు

ఆప్తమాలజి విభాగం ఆధ్వర్యంలో ఇక నుంచి కంటి సమస్యలకు సంబంధించి ఓపీ సేవలతోపాటు శస్త్రచికిత్సలను సైతం నిర్వహిస్తామని ఆప్తమాలజి విభాగాధిపతి డాక్టర్‌ రవిశేఖర్‌, డాక్టర్‌ రాజారావు పేర్కొన్నారు. కంటి సమస్యలు, శుక్లాల సమస్యలు ఉన్నవారు గాంధీ ఆస్పత్రిలోని ఆప్తమాలజి విభాగాన్ని ఆశ్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Gandhi Hosital

Gandhi Hospital : హైదరాబాద్ గాంధీ హాస్పిట‌ల్‌లోనూ ‘కాట‌రాక్ట్’ స‌ర్జ‌రీలు చేయనున్నారు. కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో ప్రత్యేక సౌకార్యలను ఏర్పాటు చేసిన‌ట్లు ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ రాజారావు పేర్కొన్నారు. కంటి సమస్యలున్నవారు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి రావాల‌ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా హాస్పిట‌ల్‌లో ఉన్న ఆప్తమాలజి విభాగంలో ఆపరేషన్లను నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత నాన్‌కోవిడ్‌ సేవలు పున:ప్రారంభమైన క్రమంలో కంటి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ‘కాటరాక్ట్‌’ సర్జరీలు అంటే కంటిలో ఏర్పడిన శుక్లాలను తొలగించే ఆపరేషన్‌లను ప్రారంభించినట్లు డాక్టర్‌ రాజారావు వెల్లడించారు. కంటి రోగుల కోసం మూడో అంతస్తులో ప్రత్యేకంగా ఆపరేషన్‌ థియేటర్‌తోపాటు 20 పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Genome Sequence: గాంధీ ఆస్పత్రిలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌