CEC Key Decision : మునుగోడు ఉపఎన్నికలో సీఈసీ కీలక నిర్ణయం.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై నిషేధం

మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై సీఈసీ నిషేధం విధించింది. జగదీశ్వర్ రెడ్డి ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది.

CEC Key Decision : మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై సీఈసీ నిషేధం విధించింది. జగదీశ్వర్ రెడ్డి ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని సీఈసీ నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.

మునుగోడు ఎన్నికల్లో సంక్షేమ పథకాలపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు. జగదీశ్వర్ రెడ్డి వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 48 గంటల పాటు జగదీశ్వర్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేయొద్దని సీఈసీ అదేశించింది. బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొన వద్దని, మీడియాకు దూరంగా ఉండాలని సీఈసీ ఆదేశించింది.

Munugodu Money : డబ్బే డబ్బు.. మునుగోడు ఉపఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, కోటి రూపాయలు సీజ్

ఓటు వేయకపోతే పెన్షన్లు ఆపేస్తామని వివాదాస్పద ప్రసంగం చేశారని జగదీశ్వర్ రెడ్డి మంత్రిపై ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఓటర్లను బెదిరించే విధంగా ప్రసంగాలు చేశారని పేర్కొంది. ఒక మంత్రిగా ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని తెలిపింది. ఆర్టికల్ 324 కింద సంక్రమించిన అధికారాలతో ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తున్నామని సీఈసీ ప్రకటించింది. ఈ నిషేధం ఈరోజు రాత్రి 7 గంటల నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు