EC Visit : తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు

రానున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో చర్చించనున్నారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది.

EC Visit Telangana : తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు అయింది. రాష్ట్రంలో అక్టోబర్ 3 నుంచి ఈసీ బృందం పర్యటించనుంది. మూడు రోజులపాటు ఈసీ బృందం పర్యటించనుంది. రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. రాజకీయ పార్టీలతో అధికారులు సమావేశం కానున్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో చర్చించనున్నారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. అలాగే తెలంగాణ సీఎస్, డీజీపీతో ఈసీ బృందం సమావేశం అవ్వనుంది.

One Nation One Election: జమిలి ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

కాగా, కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చింది. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ పార్టీలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

రాష్ట్రంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార బీఆర్ఎస్ తోపాటు వివిధ రాజకీయ పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు